కాశ్మీర్ నరకంగా మారుతోంది: సల్మాన్ ఖాన్ సంచలన ట్వీట్

by srinivas |   ( Updated:2025-04-23 13:55:50.0  )
కాశ్మీర్ నరకంగా మారుతోంది: సల్మాన్ ఖాన్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: కాశ్మీర్(Kashmir) పహల్గామ్‌(Pahalgam)లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో( terror Attack) 26 మంది పర్యటకులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడిని ప్రతిఒక్కరూ ఖండిస్తున్నారు. దేశ ప్రధాని నుంచి సామాన్య పౌరుల వరకు ఉగ్ర చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖులు, సినీ నటులు సైతం మండిపడుతున్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సైతం స్పందించారు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఉగ్రవాదుల దాడిని ఖండించారు. భూలోక సర్వమైన కాశ్మీర్ నరకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు. బాధిత కుటుంబాల కోసం తన హృదయం పశ్చాత్తాపపడుతోందని, ఒక్క అమాయకుడిని చంపినా అది మొత్తం విశ్వాన్నే చంపిన దానితో సమానమని చెప్పారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిని తాను ఖండిస్తున్నానని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు.


Next Story

Most Viewed