- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
LAC: భారత్- చైనా సరిహద్దుల్లో.. 14,300 మీటర్ల ఎత్తులో ఛత్రపతి శివాజీ విగ్రహం
దిశ, నేషనల్ బ్యూరో: చైనా సరిహద్దుల్లో మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విషయాన్ని భారత సైన్యం వెల్లడించింది. తూర్పు లడఖ్ సెక్టర్‌లోని వాస్తవాధీన రేఖ (LAC) సమీపంలో విగ్రహం ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. పాంగాంగ్ సరస్సు తీరంలో, సముద్ర మట్టానికి 14,300 అడుగుల ఎత్తులో విగ్రాహన్ని ఏర్పాటు చేసింది. లెఫ్టినెంట్ జనరల్ హితేష్ భల్లా గురువారం ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఛత్రపతి శివాజీ ఔన్నత్యం నిరంతరం స్ఫూర్తిదాయకమని లేహ్‌లోని 14 కోర్ ఎక్స్ పోస్ట్‌లో తెలిపింది. ధైర్యసాహసాలు, ముందుచూపు, చెక్కు చెదరని న్యాయాలకు ప్రతీక శివాజీ అని కొనియాడింది. "ఈ కార్యక్రమం భారతీయ పాలకుడి యొక్క అచంచలమైన స్ఫూర్తిని జరుపుకుంటుంది, అతని వారసత్వం తరతరాలకు ప్రేరణగా మిగిలిపోయింది" అని అది పేర్కొంది.
నాలుగున్నరేళ్ల ప్రతిష్టంభన
దాదాపు నాలుగున్నర ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు ప్రతిష్టంభనకు ముగింపు పలికేలా చిట్టచివరి ఘర్షణ ప్రాంతాలైన దెమ్‌చోక్, డెప్సాంగ్‌ల నుంచి భారత్, చైనా తమ సైన్యాలను ఉపసంహరించాయి. దీంతో దాదాపు నాలుగున్నరేళ్ల నుంచి ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఘర్షణ వాతావరణానికి తెర పడింది. ఆ ప్రక్రియను పూర్తి చేసిన కొన్ని వారాల తర్వాతే శివాజీ విగ్రహాన్న ఆవిష్కరించడం గమనార్హం. అక్టోబరు 21న కుదిరిన ఒక అవగాహనను అనుసరించి, రెండు పక్షాలు మిగిలిన రెండు ఘర్షణ పాయింట్ల వద్ద దళాల విరమణను పూర్తి చేశాయి. మే 5, 2020న పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత తూర్పు లడఖ్ సరిహద్దులో ప్రతిష్టంభన ఏర్పడింది. సైనిక, దౌత్యపరమైన చర్చల శ్రేణి ఫలితంగా ఉద్రిక్తతలు తగ్గాయి.