- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడిగా ప్రస్థానం.. కరప్షన్‌తో జైలు జీవితం
దిశ, వెబ్‌డెస్క్: ఆర్టీఐ యాక్ట్‌తో ప్రజా ఉద్యమాల్లోకి ఎంట్రీ, యాంటీ కరప్షన్, జన్‌లోక్ పాల్ బిల్లు వంటి ఉద్యమాలతో ప్రజల్లో పాపులారిటీ.. వెరసి మనిష్ సిసోడియా అనతికాలంలోనే పబ్లిక్ ఫిగర్‌గా మారారు. యూపీలో జన్మించిన ఆయన రాజకీయాలు, ప్రజాఉద్యమాల్లోకి రాక ముందు జీన్యూస్, ఆల్ ఇండియా రేడియో వంటి సంస్థలలో రిపోర్టర్‌గా, ఓ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేశారు.
కేజ్రీవాల్ నడిపిస్తున్న ‘పరివర్తన్’ అనే ఎన్జీవో సంస్థ ద్వారా కేజ్రీవాల్‌తో మనీష్ సిసోడియాకు ఫ్రెండ్‌షిప్ బలపడింది. అనంతరం వీరిద్దరూ అవినీతి వ్యతిరేక ఉద్యమం కారణంగా చాలా రోజులు కలిసి నడిచారు. 2011లో ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమాలు దేశాన్ని ఊపేశాయి. ఫలితంగా 2014లో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం కోల్పోయింది. అనంతరం కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఒక్కసారిగా పొలిటికల్ లైమ్ లైట్‌లో వెలుగు వెలిగిన మనీష్ సిసోడియా లిక్కర్ స్కాం కారణంగా అభాసుపాలయ్యారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం దేశాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆనాటి అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు, ప్రెజెంట్ మాజీ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. నాడు అవినీతి దేశంలో రాజ్యం ఏలుతుందన్న వ్యక్తి ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక వ్యక్తిగా మారారు. అవినీతి ఆరోపణలు, అరెస్ట్ నేపథ్యంలో ఆయన ఇటీవల పదవులన్నిటికీ రాజీనామా చేశారు. దేశ వ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరిస్తామని, బీజేపీకి తామే ప్రత్యామ్నాయమని గతంలో ఆయన అనేక సందర్భాల్లో వ్యాఖ్యనించారు.
అరవింద్ కేజ్రీవాల్ తర్వాత ఆప్ పార్టీలో పాపులర్ నేతగా మనీష్ సిసోడియాకు పేరుంది. దేశవ్యాప్త విస్తరణలో భాగంగా ఇటీవల పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ విజయ ఢంకా మోగించింది. ఇతర రాష్ట్రాల్లోనూ తమ పార్టీని ఎక్స్ పాండ్ చేయాలని ఆ పార్టీ భావించింది. ఇంతలోనే లిక్కర్ స్కాం తెరపైకి రావడం.. ఆ స్కాంలో మనీష్ సిసోడియా అరెస్ట్ కావడం జైలుకెళ్లడం వంటి పరిణామాలు ఆప్ పార్టీ విస్తరణపై, మనీష్ సిసోడియా రాజకీయ భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనిష్ సిసోడియా పేరు ప్రముఖంగా వినిపించడం ఆమ్ ఆద్మీ పార్టీకి సైతం ఇబ్బందిగా మారింది. మరి రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఆమ్ ఆద్మీ పార్టీకి ఏ మేరకు ఎఫెక్ట్ చూపనుంది అనే అంశం తేలాల్సి ఉంది.