- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదేం కర్మ నాయనా... ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటున్న అన్నా-చెల్లెళ్లు!
దిశ, వెబ్ డెస్క్: పైన హెడ్ లైన్ చదివి ఆశ్చర్యపోతున్నారా..? మీరే కాదు.. ఈ విషయం తెలిసినవారంతా కూడా ఇదే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. రకరకాలుగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మొత్తంగా వాళ్లిద్దరికైతే ఏం చేయాలో అర్థం కావడంలేదనే పరిస్థితి ఏర్పడింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే... మొదటగా వాళ్లిద్దరూ ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అప్పటి నుంచి వాళ్లిద్దరూ గాఢప్రేమలోకి వెళ్లిపోయారు. ఎలా అంటే ఒకరిని విడిచి ఒకరు క్షణం ఉండలేనంతగా వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఇలా ఆరేళ్ల నుంచి వాళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.
అయితే, ఆ యువతికి తరచుగా డీఎన్ఏ టెస్టులు చేయించుకుంటది. ఆమె చేసుకోవడమే కాక ఒకరోజు అతనికి కూడా చేయించింది. రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ చూసి షాక్ కు గురైంది. ఆ డీఎన్ఏ టెస్ట్ లో అతను ఆ యువతికి వరుసకు సోదరుడవుతాడని తేలింది. దీంతో ఆయువతి ఏం చేయాలో తెలియక నెత్తి పట్టుకుంటూ ఈ విషయాన్ని ఓ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో పెట్టింది. జరిగిన స్టోరీ అంతా చెప్పి ఇప్పుడేం చేయాలో అర్థమవ్వట్లేదంటూ పేర్కొంది. ఇదంతా తెలుసుకున్న నెటిజన్స్ రకరకాలుగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అసలు ఇంతకు నిన్నెవడు డీఎన్ఏ టెస్ట్ చేయించమన్నడు.. ఇదేం కర్మరా నాయన.. భలే తిక్క కుదిరిందిగా... ఇదేందిరా నాయన.. అంటూ ఇలా రకరకాలుగా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
Also Read : ఐదో పెళ్లికి రెడీ అయ్యాడు.. భార్యా, పిల్లల ఎంట్రీతో.. (వీడియో)