సోనాలీ హత్యకు రూ.10 కోట్ల డీల్!

by srinivas |
సోనాలీ హత్యకు రూ.10 కోట్ల డీల్!
X

చండీగఢ్: నటి, బీజేపీ నేత సోనాలీ ఫోగట్ కేసులో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన లేఖలు కలకలం రేపాయి. సోనాలి హత్య కోసం రూ.10 కోట్ల డీల్ చేసుకున్నట్లు ఓ లేఖలో ప్రస్తావించారని సోనాలి బంధువు అమన్ పూనియా తెలిపారు. మరో లేఖలో రాజకీయ నేతల పేర్లు ప్రస్తావించినట్లు చెప్పారు. కేసుకు సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని కలిగి ఉన్న రెండు లేఖలపై దర్యాప్తు చేయాలని పేర్కొన్నారు.

వీటిలో మొదటి లేఖ నెల రోజుల క్రితం, రెండో లేఖ ఈ మధ్యనే వచ్చిందని తెలిపారు. కాగా, గోవాలో పబ్‌లో సోనాలి ఫోగట్ అనుచరుల చేతిలోనే అనుమానస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు సోనాలి సోదరి రుకేష్ అదంపూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు నిర్ధారించారు. బీజేపీ నేతలతో చర్చించి ఏ పార్టీ నుంచి పోటీ చేసేది స్పష్టత ఇస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed