విషం తగ్గుతుందని కాటేసిన పామును కొరికేసిన వ్యక్తి

by Prasad Jukanti |
విషం తగ్గుతుందని కాటేసిన పామును కొరికేసిన వ్యక్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఇంకా కొంత మంది మూఢనమ్మకాల బాట పట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా పాము కాటుకు గురైన ఓ వ్యక్తి మూఢ నమ్మకంతో కొంచెంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. బిహార్ లో ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నవాడాకు చెందిన 35 ఏళ్ల సంతోష్ లోహర్ అనే వ్యక్తి రైల్వే ట్రాక్ పనులు చేస్తున్నాడు. ఇటీవల ఆయన ఓ రోజు తన పనిని ముగించికుని బేస్ క్యాంపులో నిద్రిస్తుండగా అతడికని ఓ పాము కాటు వేసింది. అదే పామును తిరిగి కొరికేస్తే దాని విషం తగ్గిపోతుందనే మూఢనమ్మకంతో తన చేతులోకి ఆ పామును తీసుకుని రెండు సార్లు కాటేశాడు. అతడి పంటి గాయానికి సదరు పాము చచ్చిపోయింది. అయితే ఈ మూఢ నమ్మకం ద్వారా అతడికి ఎలాంటి ప్రయోజనం ఉండదని గ్రహించిన సహచరులు వెంటనే అతడిని రాజౌలీ సబ్ డివిజన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించడంతో అతడు కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు.పాము కాటేస్తే వైద్యుల వద్దకు వెళ్లాలి తప్ప ఇలా మూఢ నమ్మకాలు విశ్వసిస్తే ప్రాణాలే పోతాయని ఈ విషయం తెలిసిన వారంతా చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story