Sitaram Yechury : మరణం తర్వాతా ప్రజాసేవలో సీతారాం ఏచూరి.. భౌతిక కాయం ఢిల్లీ ఎయిమ్స్‌కు అప్పగింత

by Hajipasha |
Sitaram Yechury : మరణం తర్వాతా ప్రజాసేవలో సీతారాం ఏచూరి.. భౌతిక కాయం ఢిల్లీ ఎయిమ్స్‌కు అప్పగింత
X

దిశ, నేషనల్ బ్యూరో : జీవించినన్ని నాళ్లు ప్రజా సమస్యలపై గళం విప్పిన వామపక్ష యోధుడు సీతారాం ఏచూరి(72).. మరణించిన తర్వాత కూడా ప్రజాసేవలో మమేకం అయ్యారు. న్యుమోనియాతో బాధపడుతూ ఈనెల 12న ఏచూరి తుదిశ్వాస విడవగా.. శనివారం మధ్యాహ్నం ఆయన భౌతిక కాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌కు అందజేశారు. తన పార్థివ దేహం వైద్య విద్యా బోధన, పరిశోధన అవసరాలకు ఉపయోగపడాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కోరుకునే వారు. ఆ కోరికను నెరవేర్చే క్రమంలోనే ఏచూరి కుటుంబ సభ్యులు ఆయన భౌతిక కాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌లోని అనాటమీ విభాగానికి అప్పగించారు.

అంతకుముందు శనివారం ఉదయం 11 గంటలకు ఏచూరి పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌కు తరలించారు. ఏకేజీ భవన్‌‌లో పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, అజయ్ మాకెన్, రాజీవ్ శుక్లా, కేరళ సీఎం పినరయి విజయన్, ఆప్‌ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌, వైఎస్సార్‌సీపీ నేత విజయసాయిరెడ్డిలు ఏచూరి భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు.

Advertisement

Next Story

Most Viewed