- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అదానీ అవినీతి వ్యక్తిగత వ్యవహారమా?

- ఇండియాలో దానిపై నోరు మెదపరు
- అమెరికాలో మాత్రం దాచి పెడతారు
- మోడీ తీరుపై రాహుల్ ఫైర్
దిశ, నేషనల్ బ్యూరో: వ్యాపారవేత్త, బిలియనీర్ అదానీ అవినీతిని ప్రధాని నరేంద్ర మోడీ దాచి పెడుతున్నారని ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీని అదానీ అవినీతిపై అక్కడి మీడియా ప్రశ్నించగా దాన్ని వ్యక్తిగత వ్యవహారంగా కొట్టిపారేశారు. మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ఇండియాలో అదానీ అవినీతిపై ప్రశ్నిస్తే నిశ్శబ్దంగా ఉంటారు. అదే విదేశీ గడ్డపై ప్రశ్నిస్తే వ్యక్తిగత వ్యహారం అంటూ సర్థిచెప్పుకుంటారని ఆరోపించారు. అమెరికాలో కూడా అదానీ అవినీతిని కప్పిపుచ్చుతున్నారని రాహుల్ గాంధీ 'ఎక్స్' వేదికగా విమర్శించారు. 'తన స్నేహితుడి జేబులు నింపడాన్ని దేశ నిర్మాణంగా మోడీ భావిస్తారు. అదే స్నేహితుడు లంచాలు ఇస్తూ, దేశ సంపదను దోచేస్తుంటే వ్యక్తిగత వ్యవహారంలా కనిపిస్తోందా' అని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ, ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. అదానీపై చర్యలు తీసుకునే అంశం ఏమైనా ఇద్దరు దేశాధినేతల సమావేశంలో చర్చకు వచ్చిందా అన్న ప్రశ్నకు మోడీ సమాధానం ఇస్తూ.. ఇండియా ఒక ప్రజాస్వామ్య దేశం. మా సంస్కృతి, మా తత్వశాస్త్ర ప్రకారం ప్రపంచమంతా ఒకే కుటుంబం. అలాగే ప్రతీ భారతీయుడు మా సొంత కుటుంబ సభ్యుడు. ఇద్దరు దేశాధినేతలు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాంటి వ్యక్తిగత విషయాలను చర్చించుకోమని మోడీ సమాధానం ఇచ్చారు. కాగా, ఇటీవల అదానీ 250 మిలియన్ డాలర్లను ఇండియాలోని అధికారులకు లంచాలుగా ఇచ్చారనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో మోడీని అమెరికాలో మీడియా ప్రశ్నించింది.