- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయోధ్యలో బీజేపీ రాముడు.. మా రాముడు సిద్ధరామయ్యే : ఆంజనేయ
దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటక కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి హోలాల్కెరే ఆంజనేయ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా సీఎం సిద్ధరామయ్యను శ్రీరాముడితో పోల్చారు. జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రారంభోత్సవానికి సీఎం సిద్ధరామయ్యకు ఆహ్వానం అందకపోవడంపై మీడియా ప్రశ్నించగా ఆంజనేయ వివాదాస్పద సమాధానం చెప్పారు. ‘‘సీఎం సిద్ధరామయ్య స్వయంగా రాముడు. అయోధ్యలో ఉన్నది బీజేపీకి చెందిన రాముడు. అలాంటప్పుడు రాముడిని పూజించడం కోసం అయోధ్యకు ఎందుకు వెళ్లాలి ? పబ్లిసిటీ కోసమే బీజేపీ ఇదంతా చేస్తోంది. వారు చేసుకోనివ్వండి’’ అని హోలాల్కెరే ఆంజనేయ కామెంట్ చేశారు.
ఆంజనేయుడు ఏం చేశాడో తెలుసుగా?
‘‘మా రాముడు (సిద్ధరామయ్య) మా హృదయంలోనే ఉన్నాడు. నా పేరు ఆంజనేయ. ఆంజనేయుడు ఏం చేశాడో తెలుసుగా?’’ అంటూ రాముడికి నమ్మిన బంటు అయిన హనుమంతుడ్ని ఆయన గుర్తు చేశారు.ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత బసనగౌడ పాటిల్ యత్నాల్ స్పందించారు. ఇలాంటి హిందూ వ్యతిరేకులు గతంలో కర్ణాటక మంత్రులుగా ఉండటం రాష్ట్ర దౌర్భాగ్యమని విమర్శించారు. ఆంజనేయప్ప ఆరాధ్య దైవమైన సిద్ధరామయ్యకు సంబంధించిన పూజా కార్యక్రమాలను ఆయన ఇంట్లో అన్ని విధాలుగా జరుపుకోవాలని సూచించారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడి గురించి మాట్లాడటం మానేయాలని హితవు పలికారు.