బీబీసీపై ఐటీ సర్వేలో విస్తుపోయే విషయాలు!

by GSrikanth |
బీబీసీపై ఐటీ సర్వేలో విస్తుపోయే విషయాలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్‌లోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ అధికారులు జరిపిన సర్వేపై ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ అధికారిక ప్రకటన చేసింది. బీబీసీ లావాదేవీలపైనే సర్వే చేశామని ఈ సర్వేలో సంచలన విషయాలు వెలుగు చూసినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. మూడు రోజుల పాటు సాగిన సర్వేలో బీబీసీ అకౌంటింగ్ పుస్తకాల్లో అక్రమాలు గుర్తించినట్లు ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం పేర్కొంది.

ఈ సర్వే సందర్భంగా ఎలక్ట్రానిక్ పరికరాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ సర్వే నేపథ్యంలో ఉద్యోగుల నుంచి స్టేట్ మెంట్, డిజిటల్ ఫైల్స్ పత్రాలను పరిశీలించినట్లు అధికారులు పేర్కొంది. కాగా గుజరాత్ అల్లర్లకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించిన తర్వాత ఈ సర్వే జరగడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తాజాగా ఈ సర్వేకు సంబంధించి ఐటీ అధికారులు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed