- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్ధవ్ థాక్రేకు షాక్: షిండే వర్గంలో చేరిన కీలక నేత
దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల వేళ శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రేకు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బబన్‌రావ్ ఘోలప్ సీఎం ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. రాష్ట్ర మంత్రి దాదా భూసే, మహారాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్ నీలం గోర్హేల సమక్షంలో ఘోలాప్‌ను షిండే పార్టీలోకి ఆహ్వానించారు. ఘొలాప్ నాసిక్ జిల్లా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో రాష్ట్ర మంత్రిగానూ పని చేశారు. ఈ ఏడాది జనవరి 15న ఘొలప్ శివసేన(యూబీటీ)కి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సీఎం షిండే మాట్లాడుతూ..అనేక మంది శివసేనలో చేరుతున్నారని, దీంతో పార్టీ మరింత బలపడేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఇటీవలే రాజస్థాన్‌లో ఒక ఎమ్మెల్యే శివసేనలో చేరారని, త్వరలోనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా చేరుతారని తెలిపారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే సంజయ్ పవార్ సైతం షిండే శివసేనలో చేరారు. తాను 2004లో శివసేన నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని..నిజమైన శివసేన కోసం పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.