Shehbaz Sharif: బలూచిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందిస్తాం: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్

by vinod kumar |
Shehbaz Sharif: బలూచిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని  పూర్తిగా అంతమొందిస్తాం: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: బలూచిస్థాన్ ప్రావీన్సులో ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందిస్తామని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ ప్రతిజ్ఞ చేశారు. ఇటీవల ఉగ్రవాదులు జరిగిన ప్రాంతాన్ని ఆయన గురువారం సందర్శించారు. అనంతరం ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, బలూచిస్థాన్ సీఎం సర్ఫరాజ్ బుగ్తీతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఉగ్రవాదులు అమాయక ప్రజలను చంపడానికే ప్రణాళికలు రూపొందించాని తెలిపారు. ఇటీవల జరిగిన ఘటనల కారణంగా పాకిస్థాన్ అంతటా ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. బలూచిస్థాన్ నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలని నిర్ణయించినట్టు స్పష్టం చేశారు.

బలూచిస్తాన్, ఖైబర్ ఫంఖ్తుఖ్వా ప్రావీన్సుల నుంచి మాత్రమే కాకుండా మొత్తం దేశం నుండి ఉగ్రవాదాన్ని పారదోలాలని తెలిపారు. పౌరులు, భద్రతా బలగాలు చేసిన త్యాగాలు వృథా కాబోవని చెప్పారు. కాగా, ఇటీవల బలూచిస్థాన్ ప్రావీన్సులో జరిగిన ఉగ్రదాడుల్లో సుమారు 50 మంది మరణించిన విషయం తెలిసిందే. అంతేగాక బలూచ్ వేర్పాటువాదులు ఈ ప్రాంతంలో పని చేస్తున్న పాక్‌లోని ఇతర ప్రాంతాల నుండి వచ్చిన పంజాబీలు, సింధీలపై దాడులను తీవ్రతరం చేశారు. దీంతో పాక్ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే షెహబాజ్ ఆ ప్రాంతాన్ని సందర్శించి భద్రతా పరమైన చర్యలపై చర్చించారు. మరోవైపు ప్రతీకార దాడుల్లో కనీసం 21 మంది ఉగ్రవాదులు హతమైనట్టు పాక్ భద్రతా బలగాలు వెల్లడించాయి.

Advertisement

Next Story