Ranya Rao: ఏఏ పార్టుల్లో బంగారం దాచిందో నాకు తెలుసు.. రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు

by Shamantha N |   ( Updated:2025-03-17 14:18:59.0  )
Ranya Rao: ఏఏ పార్టుల్లో బంగారం దాచిందో నాకు తెలుసు.. రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే, ఈ కేసు ప్రస్తుతం పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార కాంగ్రెస్- బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాగా.. ఈ వ్యవహారంపై బీజాపూర్ ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్ యత్నాల్ స్పందించారు. రన్యారావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. “రన్యారావు ఏఏ పార్టుల్లో బంగారం దాచిందో నాకు తెలుసు. అలాగే ఈ స్మగ్లింగ్‌లో మంత్రుల ప్రమేయం ఉంది. ఆ విషయాలన్నీ నాకు తెలుసు. అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కొక్కరి బండారం బయటపెడతా. ఆమె తండ్రి రామచంద్రరావు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి.. స్మగ్లింగ్‌కి ఎలా సహకరిస్తారు?. ఇక ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తీరులోనూ లోపాలు కన్పిస్తున్నాయి. వారిపైనా చర్యలు తీసుకోవాలి. రన్యారావు తన శరీరమంతా బంగారంతో కప్పేసింది. ఇంకా ఏ చోటులో బంగారం దాచిందో కూడా నాకు తెలుసు.” అని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతి పాయింట్‌ అసెంబ్లీలో వివరిస్తానని ఆయన పేర్కొన్నారు.

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్

ఇదిలా ఉంటే బీజేపీ ఎమ్మెల్యే పాటిల్ యత్నాల్‌కు వివాదాలకు కేరాఫ్ అడ్రెస్. గతంలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు వ్యతిరేకంగా కూడా గళమెత్తారు. ఆయన కుమారుడు, రాష్ట్ర యూనిట్ చీఫ్ విజయేంద్రపై కూడా పదే పదే విమర్శలు గుప్పించారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఆయన్ని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశఆరు. ఇక 2020లో మైనార్టీలకు వివాహ పథకాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ పథకం కావాలంటే పాకిస్థాన్ వెళ్లిపోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, మార్చి 3న బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో రూ.12 కోట్ల విలువైన బంగారంతో రన్యారావు పట్టుబడింది. ఈ కేసుపై డీఆర్ఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

READ MORE ...

R.Narayana Murthy: సీఎం రేవంత్ రెడ్డితో ఆర్.నారాయణ మూర్తి భేటీ

Next Story