- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > Sexual assault: మహారాష్ట్రలో మరో మైనర్ బాలికపై లైంగిక దాడి, హత్య.. కొల్హాపూర్‌లో ఘటన !
Sexual assault: మహారాష్ట్రలో మరో మైనర్ బాలికపై లైంగిక దాడి, హత్య.. కొల్హాపూర్‌లో ఘటన !
by vinod kumar |
X
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో ఇద్దరు పాఠశాల చిన్నారులపై జరిగిన లైంగిక దాడి ఘటన తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలోనే మరో మైనర్ బాలికపై లైంగిక దాడి, హత్య ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొల్హాపూర్‌లోని షియే గ్రామంలోని రామ్ నగర్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక బుధవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయింది. ఈ క్రమంలోనే జిల్లాలోని ఓ చెరకు తోటలో గురువారం బాలిక మృతదేహం లభ్యమైంది. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. హత్యకు ముందు బాలికపై లైంగిక దాడి జరిగినట్టు తేలిందని పలు కథనాలు పేర్కొన్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించింది.
Advertisement
Next Story