- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈతకు వెళ్లి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి
దిశ, నేషనల్ బ్యూరో : గుజరాత్లోని నర్మదా నదిలో ఈత కొట్టేందుకు దిగిన ఏడుగురు ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు వదిలారు. వీరందరినీ ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. దీంతో బాధిత కుటుంబాన్ని విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన నర్మదా జిల్లాలోని పోయిచా వద్దనున్న నర్మదా నదిలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబం మంగళవారం ఉదయం సూరత్ నుంచి నర్మదా జిల్లాలోని పోయిచాకు చేరుకుంది. ఏడుగురు కలిసి ఈత కొట్టేందుకు నర్మదా నదిలోకి దిగారు. అయితే నదీ ప్రవాహ వేగం ఒక్కసారిగా పెరగడంతో వారంతా కొట్టుకుపోయారు. వీరిలో ఒకరిద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) టీమ్ రంగంలోకి దిగి నదిలో ముమ్మరంగా వెతికింది. బుధవారం వరకు కూడా వారి ఆచూకీ దొరకలేదు. దీంతో నదిలోకి దిగిన ఏడుగురు కూడా చనిపోయి ఉంటారని నిర్ధారించారు. కాగా, నర్మదా నదిలోని పోయిచా ప్రాంతం వేసవిలో మంచి పిక్నిక్ స్పాట్. ఇక్కడ ఈత కొట్టడానికి ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు.