అసెంబ్లీలో సంచలన తీర్మానం.. 65 శాతానికి రిజర్వేషన్లు పెంపు

by GSrikanth |
అసెంబ్లీలో సంచలన తీర్మానం.. 65 శాతానికి రిజర్వేషన్లు పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ అసెంబ్లీలో సంచలన తీర్మానం చేశారు. రాష్ట్రంలో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ సభ తీర్మానించింది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50శాతం రిజర్వేషన్లు ఉండగా.. తాజాగా వాటిని 65 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు.. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం రిజర్వేషన్ 75శాతానికి పెరిగింది. తాజా ప్రతిపాదన ప్రకారం.. ఎస్సీలకు 20 శాతం లభిస్తుంది.

ప్రస్తుతం బీసీ, ఓబీసీలకు కలిసి 30శాతం ఉండగా.. అవి 43 శాతానికి పెరగనున్నాయి. మరోవైపు ఎస్టీలకు రెండు శాతాన్ని ప్రతిపాదించారు. అంతకుమందు బిహార్‌లో కుల గ‌ణ‌న‌కు చెందిన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశ‌పెట్టారు. ఆ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల‌కు చెందిన ప్రజ‌ల్లో 42 శాతం మంది క‌టిక పేద‌లే ఉన్నట్లు రిపోర్టులో వెల్లడించారు. దీంతో ఇక వెనుక‌బ‌డిన‌, ఈడ‌బ్ల్యూసీ కేట‌గిరీల‌కు చెందిన వారికి న్యాయం జరిగేలా రిజర్వేషన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Next Story