- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీజేపీ అభ్యర్థుల రెండో లిస్ట్ విశేషాలు తెలుసా ?
దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం 72 స్థానాలకు అభ్యర్థుల పేర్లను పార్టీ అధిష్టానం గురువారం అనౌన్స్ చేసింది. తెలంగాణలోని 6 లోక్‌సభ స్థానాలతో పాటు కర్ణాటకలోని 20, మహారాష్ట్రలోని 20, గుజరాత్‌లోని 7, హర్యానాలోని 6, మధ్యప్రదేశ్‌లోని 5, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని చెరో రెండు స్థానాలు, దాద్రానగర్ హవేలీ, త్రిపురలోని ఒక్కో స్థానానికి అభ్యర్థులను ఖరారు చేశారు.
రెండో జాబితాలో ప్రముఖులు..
కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషీ, పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్, శోభా కరంద్లాజేతో పాటు మాజీ సీఎంలు త్రివేంద్రసింగ్ రావత్, బసవరాజ్ బొమ్మై వంటి ప్రముఖులకు ఈ లిస్టులో చోటు దక్కింది. ఇటీవల హర్యానా సీఎం పదవికి అనూహ్య రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్(కర్నాల్ - హర్యానా)తో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(నాగ్‌పూర్ - మహారాష్ట్ర) పేరు కూడా ఈ లిస్టులో ఉంది. మహారాష్ట్రలోని ముంబయి నార్త్ నుంచి పీయూష్ గోయల్, బీద్ నుంచి పంకజ ముండే పోటీ చేయనున్నారు. కర్ణాటకలోని ధార్వాడ్ నుంచి ప్రహ్లాద్ జోషీ, హవేరీ నుంచి బసవరాజ్ బొమ్మై, బెంగళూరు రూరల్ నుంచి డా. సీఎన్ మంజునాథ్; బెంగళూరు నార్త్ నుంచి శోభా కరాంద్లాజే, బెంగళూరు సౌత్ నుంచి తేజస్వీ సూర్య, షిమోగ నుంచి మాజీ సీఎం యడియూరప్ప తనయుడు బీవై రాఘవేంద్ర పోటీ చేస్తారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ నుంచి మాజీ సీఎం త్రివేంద్రసింగ్ రావత్; గర్హ్వాల్ నుంచి రాజ్యసభ సభ్యుడు అనిల్ బలౌనీ, హిమాచల్‌ప్రదేశ్‌లోని హమిర్‌పుర్ నుంచి అనురాగ్ ఠాకూర్ బరిలో నిలుస్తారు.
తెలంగాణలోని ఆరు స్థానాలకు అభ్యర్థులు వీరే..
బీజేపీ రెండో జాబితాలో తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు దక్కింది. గోడెం నగేశ్ (ఆదిలాబాద్), గోమాస శ్రీనివాస్(పెద్దపల్లి), రఘునందన్‌రావు (మెదక్), శానంపూడి సైదిరెడ్డి (నల్లగొండ), డీకే అరుణ(మహబూబ్‌నగర్), సీతారాం నాయక్ (మహబూబాబాద్) బీజేపీ లోక్‌సభ టికెట్స్ దక్కించుకున్నారు. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. మొదటి జాబితాలో 9 మందిని ప్రకటించిన బీజేపీ, ఇప్పుడు ఆరుగురి పేర్లను అనౌన్స్ చేసింది. దీంతో 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. ఖమ్మం, వరంగల్ స్థానాలను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. సైదిరెడ్డి, గోడెం నగేశ్, సీతారాం నాయక్ ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అంతకుముందు 195 మందితో లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే.