- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు! షాక్ లో ఆర్సీబీ ఫ్యాన్స్
దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ లో రసవత్తరమైన క్వాలిఫైర్ -2 మ్యాచ్ కు ముందు ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రాణాలకు ముప్పు ఉందనే వార్తలు కలకలం రేపాయి. దీంతో ఎలిమినేటర్ మ్యాచ్ కోసం నిన్న జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ తో పాటు మీడియా సమావేశాన్ని రాయ్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ రద్దు చేసుకుంది. విరాట్ కోహ్లీ ప్రాణాలకు ముప్పు ఉందనే హెచ్చరికలతోనే టీమ్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. కోహ్లీ ప్రాణానికి ముప్పు ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఆర్సీపీ ఫ్రాంచేజీని పోలీసులు ముందుగానే అప్రమత్తం చేశారు. మొన్న అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులని పోలీసులు అరెస్ట్ చేయగా కోహ్లీ భద్రతకు ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో ఆర్సీబీ ఆటగాళ్లు బస చేసిన హోటల్ లోనూ కట్టదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారి విజయ్ సింఘా జ్వాలా చేప్పారు. ‘విరాట్ కోహ్లీ అహ్మదాబాద్ చేరుకున్న తర్వాత అరెస్టుల గురించి తెలుసుకున్నారు. అతను జాతీయ సంపద, మరియు అతని భద్రత మా అత్యంత ప్రాధాన్యత అని ఆ ఆఫీసర్ తెలిపారు. భద్రతపరమైన విషయాన్ని ఇరు జట్ల ఫ్రాంచైజీలకు సమాచారం అందించామని బెంగళూరు నిన్నటి కమిట్ మెంట్లను రద్దు చేసుకోగా రాజస్థాన్ మాత్రం కంటిన్యూ చేసిందని తెలిపారు.
Read More..
కేజ్రీవాల్‌ను బెదిరిస్తూ సందేశాలు..ఢిల్లీలో ఓ వ్యక్తి అరెస్టు