Savitri Jindal :హర్యానా ఎన్నికల బరిలో దేశంలోనే ధనిక మహిళ.. ఇండిపెండెంట్‌గా పోటీ

by Hajipasha |
Savitri Jindal Becomes Asias Richest Woman
X

దిశ, నేషనల్ బ్యూరో : మనదేశంలోనే అత్యంత ధనిక మహిళ 74 ఏళ్ల సావిత్రీ జిందాల్. ఆమె ఈసారి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో హిసార్ స్థానం నుంచి బీజేపీ టికెట్‌ను ఆశించారు. అయితే సావిత్రీ జిందాల్‌‌కు కాషాయ పార్టీ ఆ టికెట్‌ను కేటాయించలేదు. దీంతో హిసార్ సీటు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు గురువారమే చివరితేదీ కావడంతో సావిత్రీ జిందాల్ తాను ఎంచుకున్న హిసార్ స్థానం పరిధిలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ .. సావిత్రీ జిందాల్ కుమారుడే.

ప్రస్తుతం నవీన్ జిందాల్ హర్యానాలోని కురుక్షేత్ర లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. హిసార్ అసెంబ్లీ టికెట్‌ను ఈసారి హర్యానా మంత్రి కమల్ గుప్తాకు బీజేపీ కేటాయించింది. గతంలో రెండుసార్లు హిసార్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున అసెంబ్లీకి ఎన్నికైన ట్రాక్ రికార్డు సావిత్రీ జిందాల్‌కు ఉంది. 1991 నుంచి 2005 సంవత్సరం వరకు హిసార్ సీటు నుంచి అసెంబ్లీకి వరుసగా ఎన్నికైన చరిత్ర సావిత్రీ జిందాల్ భర్త దివంగత ఓపీ జిందాల్‌కు ఉంది. ఆయన హిసార్ ఎమ్మెల్యేగా ఉండగా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. దీంతో 2005లో జరిగిన బైపోల్‌లో సావిత్రీ జిందాల్ పోటీచేసి గెలిచారు. తిరిగి 2009లో జరిగి హర్యానా పోల్స్‌లోనూ ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Advertisement

Next Story

Most Viewed