- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sanjay singh: ఢిల్లీలో బీజేపీకి ఘోర ఓటమి తప్పదు: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
దిశ, నేషనల్ బ్యూరో: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బలవంతంగా అరెస్టు చేసినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. ఈ చర్యల వల్ల వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘దర్యాప్తు సంస్థలతో బెదిరింపుల వల్ల కాషాయ పార్టీకే నష్టం. వారికి ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదు’ అని పేర్కొన్నారు. ఒక్క ఆధారం కూడా లేకుండా అమానతుల్లా ఖాన్‌ను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఆప్‌పై కుట్రలు చేసి పలువురు నేతలను జైల్లో పెట్టిందని, కానీ ఇప్పటి వరకు ఒక్క నేరం కూడా రుజువు కాలేదని తెలిపారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విజయ్ నాయర్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయంపై సంజయ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.