- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశ్వాస పరీక్షలో నెగ్గిన సైనీ: 48 మంది సభ్యుల మద్దతు
దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో మూజువాణి ఓటుతో విజయం సాధించింది. మెజారిటీకి 46 మంది సభ్యులు అవసరం ఉండగా.. 41 మంది బీజేపీ, 10మంది స్వతంత్ర్య అభ్యర్థుల మద్దతు లభించింది. దీంతో విశ్వాస పరీక్షలో సైనీ సులువుగా నెగ్గారు. అంతకుముందు సీఎం సైనీ సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. సుమారు రెండు గంటల సుధీర్ఘ చర్చ తర్వాత ఓటింగ్ నిర్వహించారు. విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వెంటనే జననాయక్ జనతా పార్టీ(జేజేపీ)కి చెందిన ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలను సైతం సభకు గైర్హాజరు కావాలని విప్ జారీ చేసింది. కాగా, జేజేపీ పార్టీతో ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని నడిపిన బీజేపీ లోక్‌సభ సీట్ల పంపకాల్లో తేడా రావడంతో జేజేపీ తమ మద్దతు ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయగా..సైనీ నూతన సీఎంగా ఎన్నికయ్యారు. స్వత్రంత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.