- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ అధికారంలోకి వచ్చాకే దానిపై నిర్ణయం: సచిన్ పైలట్
జైపూర్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి విషయమై కాంగ్రెస్ పార్టీలో విభేదాలు పెరుగుతున్నాయి. ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లోత్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌లతో పార్టీ రెండు వర్గాలు చీలింది. ఈ నేపథ్యంలో సీఎం పదవిపై సచిన్ పైలట్ స్పందించారు. రాజస్థాన్‌లో సమిష్టి నాయకత్వం, వ్యక్తిగత బాధ్యతలపై తమ పార్టీకి నమ్మకం ఉందని, పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక దానిపై నిర్ణయం ఉంటుందని తెలిపారు. నేతలకు ఎటువంటి బాధ్యతలు అప్పగించాలనే అంశాన్ని హైకమాండ్ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. అందరం ఎన్నికల్లో సమిష్టిగా పోరాడతామని, మెజారిటీ సీట్లు సాధించిన తర్వాత ఎమ్మెల్యేలతో చర్చించి, పదవుల గురించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. దీనికి సంబంధించి ఎవరికైనా సందేహాలుంటే హైకమాండ్‌తో మాట్లాడి పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రజల ఆశీర్వాదంతో అధికారం మళ్లీ దక్కితే అందరం కూర్చుని బాధ్యతల గురించి మాట్లాడతామని తెలిపారు. 2018లో కూడా ఇదే విధానాన్ని అనుసరించాం. ఈ ఏడాది కూడా మెజారిటీ సాధించడమే మా మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.