- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'మోడీ ఓ పనికి మాలిన వ్యక్తి'.. ప్రధానిపై ఖర్గే కొడుకు వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు: ప్రధాని మోడీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘విష సర్పం’ అని ఇటీవల కామెంట్ చేయగా.. తాజాగా ఆయన కుమారుడు, చిత్తాపూర్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. "నాలాయక్" అంటూ పరోక్షంగా ప్రధానిపై ఆయన దూషణ చేశారు. చిత్తాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రియాంక్ ఖర్గే ఇటీవల ఒకచోట ప్రసంగిస్తూ.. " బంజారా కమ్యూనిటీకి ముదుబిడ్డను అని ప్రధాని మోడీ చెప్పుకుంటున్నారు.
కానీ బంజారాల అభివృద్ధి బాధ్యతను ఆయన నెరవేర్చలేకపోయారు. ఎస్సీ కమ్యూనిటీకి రిజర్వేషన్ల విషయంలో మోడీ ప్రాతినిధ్యం వహించే బీజేపీ ఎంతో కన్ఫ్యూషన్‌ను క్రియేట్ చేసింది " అని కామెంట్ చేశారు. ఈ స్పీచ్‌ను కొనసాగిస్తూ.. " మీరు గుల్బర్గాకు గతంలో వచ్చినప్పుడు బంజారా వర్గాల ప్రజలకు ఏం చెప్పారు? “ ఆప్ సబ్ లోగ్ డరియే మత్. బంజారా కా ఏక్ బేటా ఢిల్లీ మే బైఠా హై (మీరు భయపడకండి. బంజారాల ముద్దుబిడ్డ ఒకరు ఢిల్లీలో కూర్చున్నాడు)" అని మోడీ ప్రసంగాన్ని ప్రియాంక్ గుర్తు చేశారు.
"ఐసా నాలాయక్ బేటా ఢిల్లీ మే బైఠా తో కైసే హోతా భాయ్..? ఘర్ కైసే చలేగా? " (ఇలాంటి పనికి మాలిన కొడుకు ఢిల్లీలో కూర్చుని ఉంటే, మీరు కుటుంబాన్ని ఎలా నడుపుతారు?) అని సభకు హాజరైన ప్రజలను ప్రియాంక్ ప్రశ్నించారు. " బీజేపీ హయాంలో కర్ణాటకలో బంజారా వర్గానికి అన్యాయం జరగలేదా..? శికారిపురలోని యడియూరప్ప ఇంటిపై జనం ఎందుకు రాళ్లు రువ్వారు ? కలబురగి, జేవర్గిలో బంద్ ఎందుకు పాటించారు?" అని పేర్కొన్నారు. ఇక కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు మద్దతుగా మల్లికార్జున ఖర్గే స్పందించారు." నా కొడుకు నాలాయక్ అని తిట్టింది ప్రధాని మోడీని కాదు. ఇటీవల తనను దూషించిన ఒక పార్లమెంటు ఎంపీని ఉద్దేశించి ప్రియాంక్ ఆ విధంగా మాట్లాడాడు. ఈవిషయాన్ని ప్రియాంక్ కూడా చెప్పాడు. ఇప్పటికే ఆ ఆరోపణలను ఖండించాడు. అనవసరంగా అతడిపై బురద చల్లే ప్రయత్నం చేయొద్దు" అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.
ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు..
ఈ నేపథ్యంలో ప్రియాంక్ ఖర్గేపై ఎన్నికల కమిషన్‌కు కర్ణాటక బీజేపీ ఫిర్యాదు చేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. తమ పార్టీ అధి నాయకులను సంతోష పెట్టడానికే కాంగ్రెస్ లీడర్లు ఇలా ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకుంటున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. రాబోయే ఎన్నికల ఓటమిని తలచుకొని.. కాంగ్రెస్ లీడర్లు మతి తప్పినట్టుగా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల నేతలను తిట్టడంలో గాంధీ ఫ్యామిలీని కాంగ్రెస్ లీడర్లు సీరియస్ గా ఫాలో అవుతున్నారని దుయ్యబట్టారు.
ప్రధాని మోదీపై ప్రియాంక ఖర్గే వ్యాఖ్యలు చేసిన వీడియో క్లిప్‌ను బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా షేర్ చేస్తూ.. " ఆ కాంగ్రెస్ నాయకుడు తన సీటును కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలి. తన స్థాయికి మించిన మాటలను మాట్లాడొద్దు " అని సూచించారు. “ప్రియాంక్ ఖర్గే .. మల్లికార్జున ఖర్గే కొడుకు కాకపోతే ఏం చేసేవాడు? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిని 'నాలాయక్' అనడం సరికాదు. ప్రధానమంత్రితో విభేదించడం, విమర్శించడం మంచిది.. కానీ ఆయనపై ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదు" అని ట్వీట్‌లో పేర్కొన్నారు.