- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
J&K: జమ్ముకశ్మీర్ లో ముష్కరుల కాల్పులు.. మాజీ సైనికుడు మృతి

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగింది. ఓ మాజీ సైనికుడి(Retired army man) ఇంటిపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. కుల్గాం(J&K’s Kulgam) జిల్లాలోని బెహిబాగ్ ప్రాంతంలో మాజీ సైనికుడు మంజూర్ అహ్మద్ వాగే నివాసం ఉంటున్నారు. ఎన్నో ఏళ్లుగా అక్కడే పని చేసిన అతడు.. పదవీ విరమణ పొందిన తర్వాత కూడా భార్య, కుమార్తెతో కలిసి అదే ప్రాంతంలో జీవిస్తున్నాడు. అయితే సోమవారం రోజు మధ్యాహ్నం కొందరు ఉగ్రవాదులు(Terrorists Attack) ఆయన ఇంటిపై కాల్పులు జరిపారు. మంజూర్ అహ్మద్ వాగే.. లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో ఆయనతో పాటు ఆయన భార్య, కుమార్తెలకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంలో హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా.. మాజీ సైనికుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అలాగే గాయాలపాలైన ఆయన భార్య, కుమార్తె పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని.. ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు వెల్లడించారు.
మాజీ సైనికుడి నివాసాన్ని చుట్టుముట్టిన పోలీసులు
ఉగ్రదాడుల్లో మాజీ జవాన్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుసుకున్న పోలీసులు, పారామిలిటరీ దళాలు, ఆర్మీతో కూడిన సంయుక్త బృందం వెంటనే ఆయన నివాసం ఉంటున్న ఏరియాని చుట్టుముట్టాయి. దాడి చేసిన ఉగ్రవాదులను గుర్తించేందుకు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఇదంతా ఇలా ఉండగా.. గత నెలలో కూడా జమ్ము కశ్మీర్‌లోని సోపోర్ ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఆర్మీ సైనికులు ఎదురు కాల్పులు చేయగా.. అందులో ఓ సైనికుడు మృతి చెందాడు.