Kiran Rijuju : ఉపరాష్ట్రపతిపై అవిశ్వాస తీర్మానం విచారకరం : కిరణ్ రిజుజు

by M.Rajitha |   ( Updated:2024-12-10 14:49:43.0  )
Kiran Rijuju : ఉపరాష్ట్రపతిపై అవిశ్వాస తీర్మానం విచారకరం : కిరణ్ రిజుజు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉపరాష్ట్రపతి(Vice President)పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం(Resolution to Remove) ప్రవేశ పెట్టడం విచారకరమని అన్నారు పార్లమెంటరీ వ్యహరాలశాఖ మంత్రి కిరణ్ రిజుజు(Kiran Rijuju). రాజ్యసభ(Rajyasabha)లో జగదీప్ ధన్ ఖడ్(Jagdeep Dhankhar) నిష్పాక్షికంగా వ్యవహరిస్తారని.. ఎవ్వరిపట్ల పక్షపాతం ధోరణి చూపరని తెలియజేశారు. రాజ్యసభలో ఎన్డీఏకు మెజారిటీ అధికంగా ఉందని, తప్పకుండా ఈ పరీక్షలో తామే గెలుస్తామని అన్నారు. అయితే రాజ్యసభ ఛైర్మన్ అధికార పార్టీకి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఇండియా కూటమి జగదీప్ ధన్ ఖడ్ మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు 50 మంది ఎంపీల మద్దతు అవసరం కాగా, 60 మంది ఎంపీలు సంతకాలు చేశారని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

Advertisement
Next Story

Most Viewed