- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పంజాబ్ కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ..బీజేపీలో చేరిన ఎంపీ రవ్‌నీత్ సింగ్
దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పంజాబ్ కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలోని లూథియానాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ రవ్‌నీత్ సింగ్ బిట్టు మంగళవారం బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన అనంతరం మాట్లాడిన రవ్‌నీత్ సింగ్ బిట్టు.. ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారు. నేను పంజాబ్ సమస్యలను లేవనెత్తినప్పుడల్లా ప్రధాని, హోంమంత్రి సానుకూలంగానే స్పందిస్తారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంటే, పంజాబ్ మాత్రం ఎందుకు వెనుకబడాలి. తాను సొంత రాష్ట్రాన్ని కూడా ప్రధాని మోడీ నాయకత్వంలో అభివృద్ధి చేసుకుంటానని రవ్‌నీత్ చెప్పారు. కాగా, రవ్‌నీత్ సింగ్ తొలి నుంచి ఖలిస్తానీ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. రవ్‌నీత్ సింగ్ బిట్టు 2009-2014 మధ్య పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2014 లోక్‌సభ, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో లూథియానా నుంచి, అంతకుముందు 2009లో ఆనంద్‌పూర్ సాహిబ్ నుంచి ఎన్నికయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రవ్‌నీత్ సింగ్ 19,709 ఓట్ల తేడాతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) హర్విందర్ సింగ్ ఫూల్కాపై విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడిన నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరడంతో కాంగ్రెస్, ఆప్ పార్టీలు చిక్కుల్లో పడనున్నాయి.