పాక్‌లో ఆకలి కేకలు.. భారత్‌లో ఉచిత రేషన్ : సీఎం యోగి

by Hajipasha |
పాక్‌లో ఆకలి కేకలు.. భారత్‌లో ఉచిత రేషన్ : సీఎం యోగి
X

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్ ప్రజలు ఆకలితో అల్లాడుతుంటే.. మనదేశంలోని 80 కోట్ల మందికి ప్రతినెలా ఉచిత రేషన్ అందుతుండటం గొప్ప విషయమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 1947లో భారత్ నుంచి విడిపోయినందుకు పాకిస్తాన్ ప్రజలు పస్తులుండాల్సిన దుస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ పాలనలో భారతదేశం సస్యశ్యామలంగా ఉందని చెప్పారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం యోగి ప్రసంగించారు. ‘‘ఫిర్ ఏక్ బార్.. మోడీ సర్కార్’’ నినాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందన్నారు. అమ్రోహా నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కన్వర్ సింగ్ తన్వర్‌ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అమ్రోహా స్థానానికి రెండో దశలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. 2014లో ఈ సీటు నుంచి కన్వర్ సింగ్ తన్వర్‌ గెలిచారు. అయితే 2019లో బీఎస్పీ అభ్యర్థి డానిష్ అలీ చేతిలో ఓడిపోయారు. ఈసారి అలీ కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేస్తున్నారు.

Advertisement

Next Story