Rape Convit: డేరాబాబాకు తాత్కాలిక ఉపశమనం

by Shamantha N |
Rape Convit: డేరాబాబాకు తాత్కాలిక ఉపశమనం
X

దిశ, నేషనల్ బ్యూరో: డేరా బాబాకు తాత్కాలిక ఉపశమనం దొరికింది. సిర్సాలోని తన ఆశ్రమంలో ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న ఆయనకు.. 21రోజులపాటు జైలు నుంచి బయటకు రావడానికి అనుమతి దొరికింది. మంగళవారం ఉదయం 6:30 గంటలకు డేరాబాబా జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన ప్రస్తుతం హర్యానాలోని సరోహ్తక్ జిల్లాలోని సునారియా జైలులో ఉన్నారు. ఆయనకు 2017లో జైలు శిక్ష పడింది. ఇకపోతే, జైలు నుంచి విడుదల అయిన ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలోని డేరా ఆశ్రమంలో ఆయన బస చేస్తారని సమాచారం. 16 ఏళ్ల క్రితం జర్నలిస్టును హత్య చేసిన కేసులో డేరా చీఫ్‌తో పాటు మరో ముగ్గురు కూడా 2019లో దోషులుగా తేలారు. డేరాబాబా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో డేరాబాబా సహా మరోనలుగురిని హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed