రాముడు మాంసాహారి: ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ సంచలన వ్యాఖ్యలు

by samatah |   ( Updated:2024-01-04 05:32:26.0  )
రాముడు మాంసాహారి: ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్సీపీ(శరద్ పవార్ వర్గం) నేత జితేంద్ర అవద్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాకాహారిగా ఉన్న రాముడు 14ఏళ్ల పాటు అడవిలో ఎలా జీవించగలిగాడని ప్రశ్నించారు. రాముడు బహుజన నేత, మాంసాహారి, వేటగాడు అని చెప్పారు. ‘చదివిన చరిత్రను మనం మరచిపోలేం. రాముడు మా వాడు. తినడానికి వేటాడేవాడు. కాబట్టి రాముడు ఎప్పుడూ శాకాహారి కాదు. ముమ్మాటికీ మాంసాహారే. అడవిలో నివసించిన వ్యక్తి మాంసం తినకుండా ఎలా ఉంటాడు’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు మహారాష్ట్రలో వివాదానికి దారి తీశాయి. అవద్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ స్పందించారు. ‘హిందువులను ఎగతాళి చేసినా శివసేన(ఉద్ధవ్)వర్గం పట్టించు కోదు. కానీ ఎన్నికలు రాగానే హిందుత్వం గురించి మాట్లాడతారు. ఇదే టైంలో బాలా సాహెబ్ థాక్రే బతికుంటే అవద్ వ్యాఖ్యలను ఖండించేవారు’ అని పేర్కొన్నారు. ఈ మేరకు జనవరి 22ని డ్రై డే, వెజ్ డేగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సీఎం షిండేకు లేఖ రాశారు.

Advertisement

Next Story

Most Viewed