హిందీ మన వారసత్వానికి చిహ్నం

by John Kora |
హిందీ మన వారసత్వానికి చిహ్నం
X

- ఆ భాషను ప్రోత్సహించడం మనందరి కర్తవ్యం

- రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ

దిశ, నేషనల్ బ్యూరో: హిందీ భాష కేవలం మన దేశ అధికార భాష మాత్రమే కాదు. మన సాంస్కృతిక వారసత్వానికి, జాతీయ ఐక్యతకు చిహ్నమని రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ అన్నారు. హిందీ భాషను ప్రోత్సహించడం ప్రజలందరి బాధ్యతని ఆయన చెప్పారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికార భాషా విభాగం నిర్వహించిన మధ్య, పశ్చిమ ఉత్తర ప్రాంతాల ఉమ్మడి అధికార భాషా సమవేశంలో ఆయన మాట్లాడారు. హిందీని ప్రోత్సహించడానికి మనందరం ప్రయత్నించాని అన్నారు. ఇది రాజ్యాంగ ఆదేశం మాత్రమే కాదని.. జాతీయ అవసరమని భజన్ లాల్ పేర్కొన్నారు. మనం ప్రతీ స్థాయిలో హిందీ వాడకాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో హిందీ ప్రాముఖ్యతను గుర్తిస్తూ, డిజిటల్ ప్లా‌ట్ ఫామ్‌లలో కూడా హిందీని చేర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. హిందీ మన ఆలోచనలకు శక్తివంతమైన రూపాన్ని ఇస్తుందని చెప్పారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని భాషలను గౌరవిస్తూనే జాతీయ భాషగా హిందీని మార్చడానికి కృషి చేయాలని అన్నారు. అధికార భాష అయిన హిందీ వాడకమే మన ఐక్యమత్యానికి కీలకమని చెప్పారు.

Next Story