- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోదీజీ మణిపూర్ వెళ్ళండి : రాహుల్ గాంధీ
దిశ, వెబ్ డెస్క్ : అల్లర్లతో అట్టుడికిన మణిపూర్ ను సందర్శించి, శాంతి నెలకొల్పాలని రాహుల్ గాంధీ గురువారం ప్రధాని మోదీని కోరారు. ఢిల్లీలో నివసిస్తున్న మణిపూర్ పౌరులతో భేటీ అయిన అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడారు. రాజధాని నగరంలో తల దాచుకుంటున్న మణిపూర్ పౌరులు తమ బాధలను లోకానికి చెప్పమని అన్నారని, భద్రతా విషయంలో ఉన్న ఆందోళన కారణంగా తమ ముఖాలను మీడియాలో చూపవద్దని వారు విజ్ఞప్తి చేసినట్టు రాహుల్ తెలిపారు. ఇందుకు గాను అందరి చేతులతో కూడిన ఓ ఫోటోను సోషల్ మీడియా వేదికగా రాహుల్ పంచుకుంటూ.. మోదీకి ఓ రిక్వెస్ట్ చేశారు. 'ప్రియమైన వారికి దూరమై, ఘర్షణలతో, మానసికంగా, భౌతికంగా పడుతున్న వేదనను వారు నాతో పంచుకున్నారు. అనుక్షణం భయంతో వణుకుతున్న మణిపూర్ సోదర, సోదరీమణులు ఎదుర్కొంటున్న కఠోర వాస్తవాలు తెలుసుకుందాం. స్వాతంత్ర్య దినోత్సవ వేళ నిజామిన స్వేచ్చకు దూరమైన ఆ రాష్ట్ర దుస్థితిని తలుచుకుందాం. మోదీజీ.. మీరు వెంటనే మణిపూర్ సందర్శించి, శాంతియుత పరిష్కార మార్గాలు వెతకండి. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోండి' అంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు.