- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అర్ధరాత్రి లారీలో రాహుల్ గాంధీ జర్నీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
దిశ,డైనమిక్ బ్యూరో: భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల్లోకి చేరువ అవుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా లారీలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. గత రాత్రి ఢిల్లీ నుంచి సిమ్లాకు బయలు దేరిన రాహుల్ గాంధీ దారి మధ్యలో లారీలు భారీ సంఖ్యలో వెళ్తుండటం గమనించారు. వెంటనే కారు ఆపీ లారీలో ఎక్కేశారు. ట్రక్కులో ప్రయాణిస్తూ లారీ డ్రైవర్ల జీవితం ఎలా ఉంటుంది.. వారి సమస్యలు ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకున్నారు. అంబాలా నుంచి చండీగఢ్‌కు ట్రక్కులో ప్రయాణించారు.
అనంతరం రోడ్డు మార్గంలో సిమ్లా వైపు వెళ్లారు. ఈ నైట్ ఔట్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. కాగా, వివిధ ప్రాంతాల్లో వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయ్యేందుకు రాహుల్ గాంధీ ఈ తరహా విధానాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కర్ణాటకలో రాహుల్ గాంధీ బస్సులో ప్రయాణం చేశారు. బీఎంటీసీ బస్సులో ప్రయాణించి బెంగళూరులోని ప్రయాణికులతో ముచ్చటించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ అనుసరిస్తున్న ఈ విధానం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారుతోంది.
Read More: బ్రేకింగ్: కర్నాటక అసెంబ్లీ స్పీకర్‌గా యూటీ ఖదీర్