Rahul gandhi: వయనాడ్‌లో పర్యాటకాన్ని పునరుద్ధరించాలి.. రాహుల్ గాంధీ

by vinod kumar |
Rahul gandhi: వయనాడ్‌లో పర్యాటకాన్ని పునరుద్ధరించాలి.. రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: వయనాడ్‌లో పర్యాటకాన్ని పునరుద్దరించాలని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. ఇటీవలి విషాదం జిల్లాలో కొంత భాగాన్ని మాత్రమే ప్రభావితం చేసిందని, వయనాడ్ అందమైన పర్యాటక కేంద్రంగా ఉంది కాబట్టి ప్రజలను సందర్శించేలా ప్రోత్సహించాలని చెప్పారు. కేరళ కాంగ్రెస్ నేతలతో ఆదివారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో రాహుల్ ప్రసంగించారు. వయనాడ్‌లో టూరిజాన్ని తిరిగి అభివృద్ధి చేయడానికి గట్టి చర్యలు అవసరమని నొక్కి చెప్పారు. ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు వయనాడ్‌కు వచ్చేలా తీర్చిదిద్దాలన్నారు. సహాయం, పునరావాసంపై శాఖల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. ప్రజల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం వయనాడ్‌లో ప్రస్తుత పరిస్థితిపై నేతలను అడిగి తెలుసుకున్నారు. కాగా, జూలై 30న వయనాడ్‌లోని మెప్పాడి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది నిరాశ్రయులయ్యారు.

Advertisement

Next Story