- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2 గంటల్లో 2 నిమిషాలు.. జోకులు.. ప్రధానిపై రాహుల్ గాంధీ విమర్శలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్‌లో చేసిన 2 గంటల 13 నిమిషాల ప్రసంగంలో చివరి 2 నిమిషాలు మాత్రమే మణిపూర్ పై మాట్లాడారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. "మణిపూర్ హింసాకాండలో ఎంతోమంది ప్రజలు విలువైన ప్రాణాలను కోల్పోయారు. ఎంతోమంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. కానీ ప్రధాని మోడీ నవ్వులు చిందిస్తూ జోకులు విసురుతున్నారు. ఇది ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తికి తగదు'' అని ఆయన కామెంట్ చేశారు.
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో రాహుల్ మాట్లాడారు. "మణిపూర్ ఘర్షణలను ఆర్మీ రెండు రోజుల్లోనే నిలిపివేయగలదు. కానీ ఆ రాష్ట్రం రగులుతూనే ఉండాలని ప్రధాని కోరుకుంటున్నారు. అందుకే మంటలను చల్లార్చే ప్రయత్నం చేయడం లేదు. మణిపూర్ హింసను ఆపేందుకు అవసరమైన అన్ని అస్త్రాలు ఉన్నప్పటికీ ప్రధాని వాటిని వాడటం లేదు" అని ఆరోపించారు. భరతమాతపై ఎక్కడ దాడి జరిగినా అక్కడ తాను ఉంటానని, భరత మాత పరిరక్షణకు కట్టుబడి ఉంటానని రాహుల్ స్పష్టం చేశారు.