ఇది బలవంతులపై బలహీనుల విజయం.. రాహుల్ గాంధీ

by Javid Pasha |   ( Updated:2023-05-13 10:47:55.0  )
ఇది బలవంతులపై బలహీనుల విజయం.. రాహుల్ గాంధీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలో విద్వేష దుకాణం మూత పడి ప్రేమ దుకాణం తెరుచుకుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన.. ఇది బలవంతులపై బలహీనులు సాధించిన విజయంగా అభివర్ణించారు. కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసిన వారందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పేదల తరపున పోరాటం చేసిందని ఇది ప్రజా విజయం అన్నారు. ప్రేమతో కర్ణాటక ప్రజల మనసులు గెలుచుకోగలిగామని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తామన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ఐదు హామీలను మొదటి కేబినెట్ సమావేశంలోనే నెరవేర్చుతామని స్పష్టం చేశారు. కర్ణాటకలో నమోదైన ఫలితాలే రేపు దేశవ్యాప్తంగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

Read More... DK శివకుమార్ పుట్టినరోజున కొలువుదీరనున్న కాంగ్రెస్ సర్కార్

Next Story

Most Viewed