- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Rahul Gandhi : బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పేపర్ లీక్‌లు.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పేపర్ లీకేజీ ఘటనలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) ఆరోపించారు. యువత హక్కులను హరించివేసేందుకు పేపర్ లీక్‌ను ఆయుధంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) పరీక్షలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా పాట్నాలో దాదాపు నెలరోజుల పాలు ఆందోళన చేస్తున్న విద్యార్థులతో రాహుల్ ఇంటరాక్షన్ అయ్యారు. ఈ మేరకు తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. బీపీఎస్సీ అవకతవకలను నిరసిస్తూ గాంధీ మార్గంలో నిరసన తెలిపిన విద్యార్థులపై పాశవికంగా లాఠీచార్జి చేశారని ఫైర్ అయ్యారు. అనంతరం వారిపై బలవంతంగా కేసులు పెట్టారన్నారు. 28 పరీక్షా కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగినా దానికి అంగీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అభ్యర్థులకు న్యాయం చేయాలని, మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం బిహార్ సమస్య మాత్రమే కాదని, దేశ వ్యాప్తంగా ఈ సమస్య నెలకొందన్నారు. పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తుతానని ఈ ఏకలవ్యుల బొటనవేళ్లు నరికివేయనివ్వబోనని తేల్చి చెప్పారు.