రాహుల్ గాంధీకి అస్వస్థత.. ఇండియా ర్యాలీకి మిస్

by Harish |   ( Updated:2024-04-22 11:41:42.0  )
రాహుల్ గాంధీకి అస్వస్థత.. ఇండియా ర్యాలీకి మిస్
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో ఇండియా కూటమి మెగా ర్యాలీకి సిద్ధం కాగా, దీనికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకాలేరని సోషల్ మీడియా ఎక్స్‌లో ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. రాహుల్‌ అస్వస్థతకు గురికాడంతో ప్రస్తుతం ఢిల్లీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితిలో లేరు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దీనికి హాజరవుతారని తెలిపారు. మొదటగా జార్ఖండ్‌లోని రాంచీలో పార్టీ అభ్యర్థి సిద్ధార్థ్ కుష్వాహా తరపున జరిగే ర్యాలీలో ఖర్గే ప్రసంగిస్తారని ఆ తర్వాత సాత్నాలో జరిగే ర్యాలీలో పాల్గొంటారని జైరాం రమేష్ పేర్కొన్నారు.

ఏప్రిల్ 21న ఇండియా కూటమి సాత్నాలో "ఉల్గులన్ న్యాయ్ ర్యాలీ"ని నిర్వహించనున్నట్లు ఇంతకుముందు ప్రకటించింది. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్, ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్, మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన సహా పలు రాజకీయ పార్టీల నాయకులు ఇండియా కూటమి నిర్వహించే ర్యాలీలో పాల్గొననున్నట్లు పేర్కొనగా, అనారోగ్యం కారణంగా ర్యాలీకి రాహుల్ హాజరు కాలేకపోతున్నారు. ప్రభాత్ తారా గ్రౌండ్ లో జరిగే ఈ ర్యాలీలో మొత్తం 14 రాజకీయ పార్టీలు పాల్గొననున్నాయి.

Advertisement

Next Story

Most Viewed