ఎన్నికల్లో మోడీతో పాటు అదానీ ఓటమి.. రాహుల్ గాంధీ సెన్సేషనల్ కామెంట్స్

by Satheesh |   ( Updated:2024-06-04 12:50:56.0  )
ఎన్నికల్లో మోడీతో పాటు అదానీ ఓటమి.. రాహుల్ గాంధీ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రాసెస్ కొనసాగుతోంది. అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎన్డీఏ 290 ప్లస్ స్థానాల్లో లీడింగ్‌లో ఉండగా.. ఇండియా కూటమి 230 ప్లస్ సీట్లలో అధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, జై రాం రమేష్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు, ఇండియా కూటమి ఐక్యంగా కలిసి పని చేసిందని అన్నారు. దేశానికి ఇండియా కూటమి కొత్త విజన్ ఇచ్చిందిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ ఎన్నికల్లో మోడీతో పాటు ఆయన ఫ్రెండ్ గౌతమ్ అదానీ కూడా ఓడిపోయారని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో బీజేపీతో పాటు అనేక కేంద్ర దర్యాప్తు సంస్థలతో పోరాడామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి ఉన్న పదేళ్లు మోడీ, అమిత్ షా కేంద్ర వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రాజ్యాంగాన్ని కాపాడేందుకే మేం పోరాటం చేశామని స్పష్టం చేశారు. మాతో పాటు ప్రజలు కూడా ప్రజాస్యామ్య పరిరక్షణకు పోరాడారని కొనియాడారు. ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని (కేజ్రీవాల్) జైల్లో పెట్టారని, దీంతో మోడీ, అమిత్ షాను దేశ ప్రజలు అందరూ తిర్కరించారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed