- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'మోడీ' ఇంటిపేరుపై వ్యాఖ్యల కేసులో.. రాహుల్‌కు మరో ఎదురుదెబ్బ..
రాంచీ : "మోడీ" ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకుగానూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దాఖలైన పరువు నష్టం దావా కేసులు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని వెంటాడుతున్నాయి. దీనికి సంబంధించి గుజరాత్ లో నమోదైన కేసులో ఇప్పటికే సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. గతంలో ఇదే అంశమై జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రదీప్ మోడీ అనే న్యాయవాది రాహుల్ పై జార్ఖండ్ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో పరువు నష్టం కేసు వేశారు.
ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపును కల్పించాలంటూ రాహుల్ వేసిన పిటిషన్ ను కోర్టు బుధవారం తిరస్కరించింది. దీంతో ఆయన తప్పనిసరిగా జార్ఖండ్ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, జార్ఖండ్‌లో రాహుల్ గాంధీపై మొత్తం మూడు పరువు నష్టం కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక కేసు చైబాసాలో, రెండు కేసులు రాంచీలో నమోదయ్యాయి.