- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పశ్చిమ దేశాలకు పుతిన్ హెచ్చరికలు.. టార్గెట్ మారుస్తాం..
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ఉక్రెయిన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉంటూ ఆయుధాలు సరఫరా చేస్తే కొత్త టార్గెట్లపై దాడి చేస్తామని అన్నారు. 'ఉక్రెయిన్‌కు క్షిపణులను సరఫరా చేస్తే, మేము వాటిని నిర్ధారించుకొని, మా ఆయుధాలను ఉపయోగిస్తాము.. మేము ఇంతకు ముందు కొట్టని లక్ష్యాలను ఛేదిస్తాము' అని పుతిన్ చెప్పినట్లు రష్యా వార్తా ఏజెన్సీలు పేర్కొన్నాయి. అయితే, పుతిన్ ఖచ్చితంగా ఏ లక్ష్యాలను చేధిస్తారనేది పేర్కొనలేదు. యూఎస్ ఉక్రెయిన్‌కు తన హిమర్స్ లాంచ్ రాకెట్లను సరఫరా చేస్తామని ప్రకటనలో నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. హిమార్స్ అనేది 80 కిలోమీటర్ల (50 మైళ్ళ) దూరంలో ఉన్న బహుళ ఖచ్చితత్వ-గైడెడ్ క్షిపణులను ఏకకాలంలో ప్రయోగించగల మొబైల్ యూనిట్. అయితే అమెరికా సరఫరా చేసిన ఆయుధాల్లో ఎలాంటి కొత్తదనం లేదని, వాటిని వాడటంలోనే అంత ఉందని అన్నారు. అయితే ఉక్రెయిన్ ఆయుధాలతో సరఫరాతో పశ్చిమ దేశాలు యుద్ధాన్ని మరింత కాలం పొడగించాలనే ఉద్దేశం ఉందని చెప్పారు.