- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల తర్వాత తమ దేశాల పర్యటనకు మోడీని ఆహ్వానించిన పుతిన్, జెలెన్‌స్కీ
దిశ, నేషనల్ బ్యూరో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిత్ పుతిన్‌తో మాట్లాడిన కొన్ని గంటల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌క్సీతో కూడా మాట్లాడారు. పుతిన్ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన నేపథ్యంలో ఆ రెండు దేశాల మధ్య యుద్ధ తీవ్రత లేకపోవడంతో ఇద్దరు నేతలతో మోడీ సంభాషించారు. ఈ నేపథ్యంలో భారత్‌ను శాంతి స్థాపన దేశంగా చూస్తున్నామని పుతిన్, జెలెన్‌స్కీ చెప్పినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత తమ దేశాల్లో పర్యటించాల్సిందిగా ప్రధాని మోడీని జెలెన్‌స్కీ, పుతిన్ ఆహ్వానించినట్టు సమాచారం.
జెలెన్‌స్కీతో ఫోన్ సంభాషణలో మోడీ.. భారత్-ఉక్రెయిన్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే మార్గాలను చర్చించారు. అలాగే, దేశ ప్రజలకవసరమైన విధానాన్ని, కొనసాగుతున్న యుద్ధ సంఘర్షణకు పరిష్కారంగా చర్చలు, దౌత్యం అవసరమని సూచించారు. శాంతియుత పరిష్కారానికి మద్దతిచ్చేందుకు భారత్ తన శక్తిమేరకు ప్రయత్నిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ఈ విషయంలో ఉక్రెయిన్ ప్రజల కోసం భారత్ చేస్తున్న మానవతా సాయాన్ని అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రశంసించారు. చివరిగా గతేడాది మేలో జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ ఉక్రెయిన్ అధ్యక్షుడిని కలిశారు. గతేడాద్ ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ ప్రారంభమైన తర్వాత ఇరువురు నేతల మధ్య వ్యక్తిగత సంభాషణ జరగడం ఇదే తొలిసారి. అదేవిధంగా, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను చివరిగా 2018లో కలిశారు.