పార్టీల విజ్ఞప్తి మేరకు పంజాబ్ ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం

by Disha daily Web Desk |
పార్టీల విజ్ఞప్తి మేరకు పంజాబ్ ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం
X

ఛంఢీగఢ్: పంజాబ్‌లో ఎన్నికలు వాయిదావేస్తున్నట్లు ఎలక్షన్ కమీషన్ ప్రకటించింది. వచ్చే నెల 14 జరగాల్సిన పోలింగ్‌ను 20కి వాయిదా వేస్తున్నట్లు సోమవారం తెలిపింది. సీఎం చరణ్ జిత్ సింగ్ ఛన్నీ, బీజేపీ నేతలు విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. 'వచ్చే నెలలో వారణాసిలో జరిగే గురు రవిదాస్ జయంతి వేడుకలకు పెద్ద సంఖ్యలో పంజాబ్ ప్రజలు తరలివెళ్తారని పలు పార్టీలు తెలిపాయి.

ఎన్నికల సమయంలో ఈ వేడుకలు ఉండడంతో తేదీని మార్చాలని విజ్ఞప్తి చేశాయి. దీనిని పరిగణనలోకి తీసుకుని ఎన్నికలు వేరో రోజు నిర్వహించాలని నిర్ణయించాం. రాష్ట్ర ప్రభుత్వం, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నుండి వచ్చిన ఇన్‌పుట్‌లు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నాం' అని పేర్కొంది. అంతకుముందు పంజాబ్ సీఎంతో సహా బీజేపీ నేతలు, ఆప్ నేతలు ఎన్నికలు వాయిదా వేయాలని లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed