- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Priyanka Gandhi: ఇంది ఎంత క్యూట్ గా ఉందో చూడండి- ప్రియాంక బ్యాగ్ పై రాహుల్ ప్రశంసలు

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi) పార్లమెంటుకు తీసుకొచ్చిన బ్యాగ్ వైరల్ గా మారింది. బ్యాక్ పు ఓవైపు ప్రధాని నరేంద్ర మోడీ, మరోవైపు వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఫొటోలు ఉన్నాయి. మరోవైపు మోడీ- అదానీ భాయ్ భాయ్ అనే నినాదం ఉఁది. ఈ వినూత్న డిజైన్ బ్యాగ్ ను ఆమె వెంట పార్లమెంటుకు తీసుకెళ్లారు. ఇక, ఈ బ్యాగ్‌ని చూసిన కాంగ్రెస్ సీనియన్ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నవ్వులు చిందించారు. కాగా.. వీరి ఇరువురి మధ్య జరిగిన సంభాషణ వైరల్ గామారింది. ప్రియాంక ధరించిన ఆ బ్యాగ్ ని పట్టుకుని.. ఇది చాలా అందంగా ఉంది అని రాహుల్ చెప్పుకొచ్చారు. మొదట్లో మోడీ- అదానీ చిత్రం ఉన్న ఫ్రంట్ డిజైన్‌ను చెక్ చేసి.. వెనుక వైపు ఉన్న నినాదాన్ని చదవడానికి దాన్ని తిప్పాడు.. ఆ నినాదాన్ని చూడగానే, రాహుల్ గాంధీ నవ్వుతూ.. “ఇది ఎంత క్యూట్ గా ఉందో చూడండి” అని ఇండియా కూటమి నేతలకు చూపించారు. ఆ బ్యాగ్ డిజైనర్ గురించి కూడా ప్రియాంకను రాహుల్ అడగడంతో ఆమె కూడా నవ్వుతూ ముందుకు కొనసాగింది.