అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోడీ ఫోన్

by Gantepaka Srikanth |
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోడీ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(US President Donald Trump)కు ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అనంతరం అగ్రరాజ్యం అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన ట్రంప్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ప్రపంచ శాంతి(World Peace), శ్రేయస్సు, భద్రత కోసం అమెరికా-భారత్ కలిసి పని చేస్తాయని ప్రధాని మోడీ చెప్పారు. కాగా, డొనాల్డ్ ట్రంప్‎తో ఫోన్ మాట్లాడిన విషయాన్ని ప్రధాని మోడీ సోషల్ మీడియా(X) ద్వారా తెలియజేశారు. ఇదిలా ఉండగా.. 2025, జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. వచ్చి రావడంతోనే ట్రంప్ తనదైన దూకుడుతో వ్యవహరిస్తున్నారు.

జో బైడెన్ ప్రభుత్వం(Joe Biden Govt) తీసుకొచ్చిన దాదాపు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను రద్దు చేశారు. ఇదిలా ఉండగా.. ప్రమాణ స్వీకారం రోజున చెప్పినట్లుగానే అక్రమ వలసదారుల(Illegal immigrants)పై ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ అక్రమ వలసదారుల్ని గుర్తించే క్రమంలో గురుద్వారా(Gurdwara)లనూ వదలడం లేదు. హెమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి చెందిన అధికారులు న్యూయార్క్‌, న్యూజెర్సీల్లోని ఈ ప్రార్ధనా మందిరాల్లోనూ తనిఖీలు చేయడంపై సిక్కు సంస్థలు మండిపడుతున్నాయి. గురుద్వారాల పవిత్రతకు ఈ చర్య ముప్పుగా పరిణమించిందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.

Next Story

Most Viewed