కొత్త పార్లమెంట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ

by GSrikanth |
కొత్త పార్లమెంట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్వతంత్ర భారత చరిత్రలో మరోకొత్త అధ్యాయం లిఖించబడింది. దేశరాజధాని ఢిల్లీలో అత్యాధునిక సదుపాయాలు, సకల హంగులతో నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితమిచ్చారు. పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. తొలుత మహాత్మగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి ప్రధాని మోడీ అనంతరం పార్లమెంట్ భవనం వద్ద జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెంగోల్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించించారు. పూజల అనంతరం మఠాధిపతులు మోడీకి సెంగోల్‌ను అందజేయగా దానిని స్పీకర్ కుర్చీకి కుడివైపున ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎన్ క్లోజర్‌లో ప్రతిష్టించారు.

ఆ తర్వాత ప్రధాని, స్పీకర్ కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా పార్లమెంట్ హాల్‌లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ భవన నిర్మాణ కార్మికులకు మోడీ సత్కరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎలాంటి ప్రకటన చేయకుండానే దూరంగా ఉంది. రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడాన్ని నిరసిస్తూ విపక్షాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. ఈ సందర్భంగా కొత్త పార్లమెంట్ లో తొలి సభ ప్రారంభమైంది. ఈ సభలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, లోక్ సభ స్పీకర్, ప్రధాని మోడీ, ఎంపీలు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి, మాజీ స్పీకర్లు హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed