వాయనాడ్ ఘటనపై ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము దిగ్బ్రాంతి

by Mahesh |
వాయనాడ్ ఘటనపై ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము దిగ్బ్రాంతి
X

దిశ, వెబ్ డెస్క్: కేరళ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వయనాడ్ లోని మెప్పాడిలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇప్పటి వరకు 45 మంది మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. అలాగే సోమవారం రాత్రి 4 గంటల సమయంలో ఒక్కసారిగా బురదతో కూడిన కొండచరియలు దూసుకురావడంతో చురల్‌మలా గ్రామం పూర్తిగా ద్వంసం అయింది. ఈ ఘటనలో ఆ గ్రామంలోని దాదాపు 400 కుటుంబాలు కొండచరియల్లో చిక్కుకోగా ఇప్పటివరకు 70 మందిని ప్రాణాలతో కాపాడారు. వారికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘోర ప్రమాదంపై భారత ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ ఘటనపై సీఎం పినరయి విజయన్ తో ప్రధాని మోడీ ఫోన్ లో మాట్లాడారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని భారత ఆర్మీ సహాయం తీసుకోవాలని సూచించారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు 225 మంది ఆర్మీ జవాన్లు సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో కనిపించకుండ పోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు, స్థానికులు చెప్పుకొస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed