- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NTR ప్రభుత్వాన్ని పడగొట్టింది వాళ్లే: ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ కూల్చివేస్తోందని కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ఆరోపణలకు ప్రధాని మోడీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెబుతూ కాంగ్రెస్‌పై మోడీ విరుచుకుపడ్డారు. భారత దేశం ఏ కుటుంబ జాగీరు కాదని ఫైర్ అయ్యారు. 6 వందల స్కీమ్స్‌కి నెహ్రూ, గాంధీల పేర్లు పెట్టారని.. మరి నెహ్రూ ఇంటి పేరును ఎందుకు వదిలేశారని ఆయన ప్రశ్నించారు. ఆర్టికల్ 356ను కాంగ్రెస్ దుర్వినియోగం చేసిందన్నారు. ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలను కాంగ్రెస్ అక్రమంగా పడగొట్టిందని ఆరోపించారు. దివంగత ప్రధాని ఇందీరా గాంధీ ఆర్టికల్ 356ని 50 సార్లకు పైగా దుర్వినియోగం చేసిందని పేర్కొన్నారు. తమిళనాడులో ఎంజీఆర్.. ఏపీలో ఎన్టీఆర్ ప్రభుత్వాలను కాంగ్రెస్ అక్రమంగా కూలగొట్టిందని ఆరోపించారు. ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికాకు వెళ్తే.. కాంగ్రెస్ ఆయన ప్రభుత్వమే లేకుండా చేసిందని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి : కాంగ్రెస్ దేశాన్ని సర్వనాశనం చేసింది: రాజ్య సభలో నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ