ఒలింపిక్ క్రీడాకారుల్ని.. ఘనంగా సత్కరించిన ప్రధాని మోడీ.!

by Geesa Chandu |   ( Updated:2024-08-15 12:29:59.0  )
ఒలింపిక్ క్రీడాకారుల్ని.. ఘనంగా సత్కరించిన ప్రధాని మోడీ.!
X

దిశ, వెబ్ డెస్క్: ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.. న్యూ ఢిల్లీలోని తన నివాసంలో పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొని, పతకాలను సాధించిన భారత క్రీడాకారులను ప్రధాని మోదీ స్వయంగా కలిసి వారిని సత్కరించారు. పారిస్ ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు, డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్, సరబ్ జ్యోత్ సింగ్, అమన్ సెహ్రావత్ లను మోడీ సత్కరించారు. దేశానికి అవార్డులను తెచ్చినందుకు వారిని సత్కరించి అభినందనలు తెలియజేశారు మోదీ. ఈ సందర్భంగా మోదీ పతక విజేతలతో ఏర్పాటు చేసిన విజేతలతో మాట్లాడుతూ.. "పారిస్ ఒలింపిక్స్ లో భారత్ తరపున పతకాలు సాధించినందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని, మున్ముందు దేశానికి మరిన్ని పతకాలు సాధించాలని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో భారత్ తరపున మొత్తం 6 పతకాలను సాధించారు. వారిలో మను భాకర్, సరభ్ జ్యోత్ సింగ్, స్వప్నిల్ కుసాలే, పురుషుల హాకీ జట్టు, నీరజ్ చోప్రా, అమన్ సెహ్రావత్ లు ఉన్నారు. యావత్ దేశంలోని 140 కోట్ల మంది భారతీయుల తరఫున దేశ అథ్లెట్లందరినీ అభినందిస్తున్నట్లు, దీంతో పాటుగా మరిన్ని కొత్త కలలు, సంకల్పాలతో ముందుకు సాగుదామని".. ప్రధాని మోదీ ఈ సందర్భంలో వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed