- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
President Trump: షాకిచ్చిన ప్రెసిడెంట్ ట్రంప్.. స్వదేశానికి 205 మంది భారతీయులు!

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్‌కు బిగ్ షాకిచ్చాడు. ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నాడు. ఈ క్రమంలోనే అమెరికా (America)లో ఎన్నడూ లేని విధంగా దేశంలో అక్రమంగా వలస వచ్చిన వారి ఏరివేతకు స్పెషల్ ఆపరేషన్‌కు అనుమతి ఇచ్చారు. దాదాపు 18 వేల మంది భారతీయులు అక్కడ అక్రమంగా నివసిస్తున్నట్లుగా అధికారులు లెక్క తేల్చారు. ఈ పరిణామంతో దొరికిన వారిని దొరికినట్లుగా అగ్రదేశానికి అక్రమంగా వలస వెళ్లిన భారతీయులను విమానంలో స్వదేశానికి తరలిస్తున్నారు. అయితే, కొన్ని గంటల క్రితం టెక్సాస్ నగరం నుంచి ఓ విమానం భారత్‌కు బయలుదేరినట్లుగా తెలుస్తోంది.
అందులో దాదాపు 205 మంది భారతీయులు ఉన్నారని.. మరికొద్ది గంటల్లోనే ఆ ఫ్లైట్ ఢిల్లీకి చేరుకోనున్నట్లుగా నేషల్, సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే, వారందరినీ సీ-17 యూఎస్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ (C-17 US military aircraft)లో తరలించారని సమాచారం. స్వదేశానికి ఆ ఫ్లైట్ చేరుకోవడానికి మరో 24 గంటలు పడుతుందని అంచనా. కాగా, అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాలపై ఇప్పటికే భారత్ కూడా రియాక్ట్ అయింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఆ విషయంతో పెద్ద నేరంతో ముడిపడి ఉందని అన్నారు. వీసా గడువు ముగిసినా లేదా సరైన ధృవీకరణ పత్రాలు చూపకపోయినా.. భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ కూడా ఇప్పటికే స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది.