దేశం గర్విస్తోంది.. వినేశ్ ఫొగట్‌కు అండగా నిలిచిన రాష్ట్రపతి

by Gantepaka Srikanth |
దేశం గర్విస్తోంది.. వినేశ్ ఫొగట్‌కు అండగా నిలిచిన రాష్ట్రపతి
X

దిశ, వెబ్‌డెస్క్: అనుకోని పరిస్థితుల కారణంగా పారిస్ ఒలంపిక్స్‌ నుంచి వైదొలిగిన వినేశ్ ఫొగట్‌కు ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ స్పందించి ‘చాంపియన్లకే చాంపియన్. మీ పోరాట పటిమ అందరికీ ఆదర్శం’ అని ఫొగట్‌కు భరోసా ఇచ్చారు. అనంతరం వరుసగా కేంద్ర మంత్రులు సైతం ఆమెలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. తాజాగా ఆమెకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అండగా నిలిచారు. ఈ మేరకు బుధవారం కీలక ప్రకటన విడుదల చేశారు. పారిస్ ఒలంపిక్స్‌లో వినేశ్ ఫొగట్ అసాధారణ ప్రతిభ కనబరిచారు. తన ప్రతిభతో దేశం గర్వపడేలా చేశారు. ఆమెకు దేశం మొత్తం అండగా నిలవాలి. 140 మంది కోట్ల ప్రజల హృదయాల్లో ఫొగట్ చాంపియన్‌గా నిలిచారు. భవిష్యత్ క్రీడాకారులకు ఫొగట్ ఆదర్శంగా నిలుస్తారు. భవిష్యత్తులో ఫొగట్ మరిన్ని అవార్డులు సాధించాలని కోరుకుంటున్నా’ అని రాష్ట్రపతి సందేశం పంపించారు. కాగా, 50 కిలోల విభాగంలో పోటీ పడేందుకు కావాల్సిన బరువు కంటే ఆమె 100 గ్రాములు ఉండటంతో ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ అనర్హత వేటు వేశాయి.

Advertisement

Next Story

Most Viewed